హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్

బంగాళాఖాతంలో రెండు ఆవర్తనాలు, ద్రోణితో వాతావరణ శాఖ హైదరాబాద్ వాసులను అప్రమత్తం చేసిం

Update: 2023-09-27 12:35 GMT

బంగాళాఖాతంలో రెండు ఆవర్తనాలు, ద్రోణితో వాతావరణ శాఖ హైదరాబాద్ వాసులను అప్రమత్తం చేసింది. హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. జంటనగరాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో వర్షం కురుస్తుంది. తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది. రానున్న మూడు రోజులు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ లో వర్షం దంచికొడుతుంది. పలు ప్రాంతాల్లో రహదారులు నీటమునిగాయి.

భారీ వర్షమే....
హైదరాబాద్ కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జంటనగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రేపు గణేశ్ శోభాయాత్ర ఉండటంతో భారీ వర్షం అడ్డంకిగా మారుతుందా? అన్న అనుమానం కలుగుతుంది. ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరికతో విద్యుత్తు శాఖ అప్రమత్తమయింది. గణేశ్ నిమజ్జనానికి భారీ వర్షం ఆటంకం కాకూడదని నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోనూ భక్తులు ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags:    

Similar News