Hyderabad : హైదరాబాదీలు బీ అలెర్ట్.. మూడు గంటల్లో భారీ వర్షం.. బయటకు రాకండి
రాగల మూడు గంటల్లో హైదరాబాద్ లో భారీవర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
రాగల మూడు గంటల్లో హైదరాబాద్ లో భారీవర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో అధికారులు కూడా అలెర్ట్ అయ్యారు. హైదరాబాద్ నగరంలో గత కొద్ది రోజులుగా సాయంత్రానికి భారీ వర్షం కురుస్తుంది. రహదారులన్నీ జలమయమవుతున్నాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. విధులకు వెళ్లిన వారు తిరిగి వచ్చే సమయంలో వర్షం కురుస్తుండటంతో ట్రాఫిక్ స్థంభించిపోతుంది. అందుకే మూడు గంటలు ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
నగరంలో ట్రాఫిక్ సమస్య...
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యవర్షం పడితే చెప్పలేం. రోడ్లమీదకు నీళ్లు చేరి వాహనాలన్నీ నీటిలో నిలిచిపోతాయి. అందుకే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలకు చెందిన ఉద్యోగులు వివిధ సమయాల్లో వేళలు మార్చుకుని రోడ్డు మీదకు వాహనాలను తీసుకుని రావాలని పోలీసులు కోరుతున్నారు. వర్షపు నీరు పడిన వెంటనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తొలగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ పురాతన నాలాలు కావడంతో నీరు నిలిచిపోతుంది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింంది. మరో మూడు గంటల్లో భారీ వర్షం పడుతుండటంతో హైదరాబాదీలూ.. బీ అలర్ట్. బయటకు రాకండి.