Hyderabad : హైదరాబాదీలకు హెచ్చరిక.. సాయంత్రం త్వరగా ఇల్లు చేరితే క్షేమం
ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది
హైదరాబాద్ వాసులకు ఈరోజు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు, రేపు తేలికపాటి, మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ లో మాత్రం భారీ వర్షం కురిసే అవకాశముందని చెప్పింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. గంటకు ముప్పయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది.
భారీ వర్షమంటూ...
పశ్చిమ, నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించడంతో ఈ భారీ వర్షం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. చెట్ల కింద, విద్యుత్తు స్థంభాల పక్కన నిలుచుని ఉండకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు. వీలయినంత త్వరగా సాయంత్రం ఇంటికి చేరడం క్షేమమని పేర్కొంది. గత రెండు రోజులుగా వరసగా సాయంత్రం వేళ హైదరాబాద్ లో వర్షం పడుతూ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. రోడ్లమీదకు నీళ్లుచేరుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.