హైదరాబాద్‌ లో 23 కి.మీల సైకిల్ ట్రాక్.. నేడు ప్రారంభం

హైదరాబాద్‌లో అధునాతమైన సైకిల్ ట్రాక్ ను నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.

Update: 2023-10-01 04:40 GMT

హైదరాబాద్‌లో అధునాతమైన సైకిల్ ట్రాక్ ను నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. అవుటర్ రింగ్ రోడ్డు వద్ద ఈ ట్రాక్ ను ప్రత్యేకంగా నిర్మించారు. దాదాపు 23 కిలోమీటర్ల మేర ఈ సైకిల్ ట్రాక్ ను ఏర్పాటు చేశారు. సైకిలిస్ట్‌లు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళ దీనిపై తిరిగేందుకు వీలుగా ఈ ట్రాక్ ను అత్యాధునికంగా నిర్మించారు. దీనికి సోలార్ రూఫ్ ను కూడా ఏర్పాటు చేశారు. మూడు వరసలుగా ఈ సైకిల్ ట్రాక్ ను ఏర్పాటు చేశారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో...
ఒకటి నార్సింగి నుంచి పోలీసు అకాడమీ వరకూ, రెండోది నానక్‌రాం గూడ నుంచి కొల్లూరు వరకూ ఈ ట్రాక్ లను ఏర్పాటు చేశారు. ఈరోజు మంత్రి కేటీఆర్ ఈ ట్రాక్ ను ప్రారంభించనున్నారు. వీటి పైన నిర్మించిన సోలార్ సిస్టమ్ ద్వారా రోజుకు పద హారు మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని అధికారులు వెల్లడించారు. ఈ ట్రాక్ ఏర్పాటులో అన్ని రకాల వసతులతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించామని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News