Allu Arjun : అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన ఆరుగురి అరెస్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఆరుగురు యువకులు ఈ దాడిలో పాల్గొన్నారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా పరిశీలించిన పోలీసులు ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని మరికాసేపట్లో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చే అవకాశాలున్నాయి. వీరంతా ఓయూ జేఏసీ నేతలుగా గుర్తించారు.
దాడి చేసి...
నిన్న అల్లు అర్జున్ నివాసంలో ఆరుగురు యువకులు దాడి చేయడంతో వారి ఇంట్లోని పూలకుండీలు ధ్వంసమయ్యాయి. రాళ్లు విసరడంతో ఇంట్లో వాళ్లు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పోలీసు ఉన్నతాధికారులకు సీరియస్ గా ఆదేశాలు జారీ చేయడంతో ఆరుగురు యువకులను గుర్తించి అరెస్ట్ చేశారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now