Petrol : మళ్లీ హైదరాబాద్‌లో పెట్రోలు రగడ

పెట్రోల్ కొరత ఉందని ప్రచారం జరగడంతో హైదరాబాద్‌లోని అనేక పెట్రోలు బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు;

Update: 2024-01-09 03:46 GMT
Petrol : మళ్లీ హైదరాబాద్‌లో పెట్రోలు రగడ

Motorists queued up at many petrol stations

  • whatsapp icon

పెట్రోల్ కొరత ఉందని ప్రచారం జరగడంతో హైదరాబాద్‌లోని అనేక పెట్రోలు బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. కొన్ని పెట్రోలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టేశారంటూ వదంతులు కూడా వ్యాపించాయి. దీంతో పెట్రోలు కొట్టించుకుందామని ఎక్కువ మంది వాహనదారులు పెట్రోలు బంకులకు చేరుకుంటున్నారు. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది. అయితే ఎటువంటి పెట్రోలు కొరత లేదని యాజమాన్యం చెబుతున్నా వాహనదారులు మాత్రం వినిపించుకోవడం లేదు.

నాలుగు రోజుల క్రితం...
నాలుగు రోజుల క్రితం ఆయిల్ ట్యాంకర్లు సమ్మె చేయడంతో పెట్రోలు లేక అనేక బంకుల్లో నో స్టాక్ బోర్డును పెట్టేశాయి. అయితే పెట్రోలును కొట్టించుకుందామని భావించి ఎక్కువ సంఖ్యలో వాహనదారులు చేరడంతో నగరమంతా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. పోలీసలు జోక్యం చేసుకుని చక్కదిద్దాల్సిన పరిస్థితి వచ్చింది. నగరమంతా ఈ వార్త వ్యాపించడంతో నాలుగు రోజుల క్రితం జరిగిన విధంగానే నేడు కూడా పెట్రోలు కొరత అన్న ప్రచారంతో వాహనదారులు పెట్రోలు బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు.


Tags:    

Similar News