Chutneys : చట్నీస్ హోటల్స్‌పై ఐటీ దాడులు .. అందుకేనా?
హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్ చట్నీస్ లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు;
హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్ చట్నీస్ లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చట్నీస్ హోటల్స్ యజమాని ఇంట్లోనూ ఈ సోదాలను జరుగుతున్నట్లు తెలిసింది. అయితే ఇటీవల వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డితో చట్నీస్ సంస్థల అధినేత అట్లూరి పద్మ కుమార్తెకు వివాహం జరిగిన సంగతి తెలిసిందే.
మేఘనా ఫుడ్స్ లోనూ...
అలాగే హైదరాబాద్ లో ఉన్న మేఘనా ఫుడ్స్ ఈటరీస్‌లోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. మేఘనాఫుడ్స్ కు తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో బ్రాంచీలున్నాయి. ఈ దాడులకు సంబంధించిన సమాచారాన్ని ఐటీ శాఖ అధికారుల నుంచి అధికార ప్రకటన మాత్రం వెలువడలేదు.