Diwali Rush : దీపావళి ఎఫెక్ట్ : బస్టాండ్, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ

దీపావళి పండగకు సొంత ఊళ్లకు అనేక మంది బయలుదేరి వెళుతున్నారు. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది

Update: 2024-10-30 06:41 GMT

దీపావళి పండగకు సొంత ఊళ్లకు అనేక మంది బయలుదేరి వెళుతున్నారు. వరసగా నాలుగురోజుల పాటు సెలవులు రావడంతో సొంత గ్రామాలకు బయలుదేరి వెళుతున్నారు. దీంతో జూబ్లీ బస్టాండ్, ఇమ్లిబన్ బస్టాండ్ లో ప్రయాణికులతో కిటకిటలాడిపోతుంది. సొంతూళ్లకు వెళ్లటానికి పిల్లా పాపలతో్ బస్టాండ్ లో చేరుకోవడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. దీంతో ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాలకు, అటు ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడిపోతున్నాయి. దీపావళి పండగ కోసం టీజీ ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీలు ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్నాయి.

తొలిసారి క్యూ లైన్...
మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. స్పెషల్ ట్రైన్లతో పాటు రైల్వే స్టేషన్లలో జాగ్రత్త చర్యలు తీసుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయోగాత్మకంగా ఈరోజు నుంచి క్యూలైన్ విధానం అమలు చేస్తున్నారు. జనరల్ బోగీలు ఆగే చోట ప్లాట్ ఫామ్ ల పై క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. తోపులాట లేకుండా లైన్ లో నిల్చొని ప్రశాంతంగా ట్రైన్ ఎక్కేందుకు వీలుగా క్యూలైన్ విధానాన్ని తొలి విడతగా విజయవాడ మార్గంలోని రైళ్లలో సౌత్ సెంట్రల్ రైల్వే ప్రవేశపెట్టింది.


Tags:    

Similar News