నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్‌కు రానున్నారు. నల్సార్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు.

Update: 2024-09-28 02:30 GMT

draupadi murmu

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్‌కు రానున్నారు. హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో నిన్న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పోలీస్‌, రెవెన్యూ, ఆర్‌ అండ్‌ బీ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, అటవీ, విద్యుత్‌, తదితర శాఖల ఏర్పాట్లపై కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు.

ట్రాఫిక్ సమస్యలు...
రాష్ట్రపతి పర్యటించే ప్రాంతాలపై రహదారులపై ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నం కాకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పటిష్టమైన పోలీస్ బందోబస్తును పర్యవేక్షించాలని పోలీసులకు సూచించారు. సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్‌-2024ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ప్రారంభించనున్నారు..


Tags:    

Similar News