Hyderabad : హైదరాబాద్ లో వింత ప్రచారం.. ఎవరూ నమ్మొద్దంటున్న పోలీసులు
హైదరాబాద్ లో సోషల్ మీడియాలో ఒక వదంతి వైరల్ గా మారింది. ఎవరూ నమ్మవద్దని నగర పోలీసులు తెలిపారు.;
హైదరాబాద్ లో సోషల్ మీడియాలో ఒక వదంతి వైరల్ గా మారింది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ ఫోన్ చేస్తే పోలీసు వాహనం వచ్చి ఇంటివద్ద దింపుతుందని ప్రచారం జరుగుతుందన్నారు. పోలీసు వాహనాలు వచ్చి మహిళలను తీసుకెళ్లి దింపుతారని చెప్పడం తప్పుడు ప్రచారమని తెలిపారు.
సోషల్ మీడియాలో...
దీనికి సంబంధించి సోషల్ మీడియా లో ఫోన్ నెంబర్లు కూడా పెడుతున్నారని, ఇటువంటి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరూ ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని, నమ్మి మహిళలు మోసపోవద్దని పోలీసులు కోరారు. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిపై వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసులు హెచ్చరించారు.