Hyderabad: హైదరాబాద్ వాసులకు జలమండలి కీలక సూచన
హైదరాబాద్ వాసులకు జలమండలి అధికారులు కీలక సూచనలు చేశారు. పలు ప్రాంతాలలో;
హైదరాబాద్ వాసులకు జలమండలి అధికారులు కీలక సూచనలు చేశారు. పలు ప్రాంతాలలో రెండు రోజుల పాటు తాగు నీటిని నిలిపి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరానికి తాగునీటిని సరఫరా చేసే కృష్ణా తాగునీటి సరఫరా ఫేజ్-1లోని సంతోష్ నగర్‌లో 1600 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్ కోసం జంక్షన్ పనులు జరుగుతున్నాయని.. ఎస్‌ఆర్‌డీపీ పనుల్లో భాగంగా నల్గొండ-ఓవైసీ డౌన్‌ర్యాంప్ అలైన్‌మెంట్‌లోని సంతోష్‌నగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ పనులు చేయనున్నారు. ఈ పనులు జనవరి 3వ తేదీ బుధవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 4వ తేదీ గురువారం ఉదయం 6 గంటల వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు. 24 గంటల పాటూ నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. మీరాలం, కిషన్‌బాగ్, అల్జుబైల్ కాలనీ, సంతోష్‌నగర్, వినయ్‌నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, అస్మాన్‌గఢ్, యాకుత్‌పురా, మాదన్నపేట్, మహబూబ్ మాన్షన్, రియాసత్‌నగర్, అలియాబాద్, బొగ్గికుంట, అఫ్జల్‌గంజ్, నారాయణగూడ, అడిక్‌మెట్, శివన్‌రోడ్, మంగలగూడ, మంగలగూడ, మంగలగూడ ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది.