ప్రధాని మోదీ పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు అమలు

ప్రధాన మంత్రి మార్చి 4న తెలంగాణలో పర్యటించనున్నారు. ఆదిలాబాద్‌లో జరిగే

Update: 2024-03-04 05:47 GMT

ప్రధాన మంత్రి మార్చి 4న తెలంగాణలో పర్యటించనున్నారు. ఆదిలాబాద్‌లో జరిగే ప్రజా కార్యక్రమంలో 56,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా, బేగంపేట విమానాశ్రయం నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లే మార్గంలో మార్చి 4న రాత్రి 7:40 నుంచి 8:10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.

ఈ ఆంక్షలు ఎయిర్‌పోర్ట్ Y జంక్షన్, P&T ఫ్లైఓవర్ కింద కుడి మలుపు, షాపర్స్ స్టాప్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట్ ఫ్లైఓవర్, గ్రీన్‌ల్యాండ్స్, రాజీవ్ గాంధీ విగ్రహం/మోనప్ప ఐలాండ్ జంక్షన్ వద్ద ఎడమ మలుపు, యశోద హాస్పిటల్, MMTS, రాజ్ భవన్ వద్ద వర్తిస్తాయి. హైదరాబాద్‌లో మార్చి 5న రాజ్‌భవన్‌ నుంచి బేగంపేట విమానాశ్రయం వరకు.. ఉదయం 9:50 నుంచి 10:15 గంటల మధ్య ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు.
ఇక ప్రధానమంత్రి మోదీ పర్యటన షెడ్యూల్‌లో చివరి నిమిషంలో స్వల్ప మార్పు జరిగింది. ఉదయం 11:30 గంటలకు నాగ్‌పూర్‌లో హెలిప్యాడ్‌ వద్దకు రానున్నారు. అంతకుముందు షెడ్యూల్‌ 10:20 గంటలకు అని ఉంది. ఒక గంట ఆలస్యంగా ప్రధాని మోదీ పర్యటన ప్రారంభం కానుంది.


Tags:    

Similar News