Telangana : ఒక్కసారిగా చల్లబడిన నగరం.. చిరుజల్లులతో

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిన్నటి వరకూ తీవ్రమైన ఎండలతో ఉన్న ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది.

Update: 2024-03-17 04:16 GMT

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిన్నటి వరకూ వేడి గాలులు, ఉక్కపోత, తీవ్రమైన ఎండలతో ఉన్న ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. ఆకాశమంతా మేఘావృతమయింది. తెలంగాణలో అక్కడక్కడ కుండపోత వర్షం కురిసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో్ హైదరాబాద్ నగరంలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.

ద్రోణి ప్రభావంతో...
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కొనసాగుతుండటంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో హైదరాబాద్ లో వర్షం కురిసే అవకాశముందని తెలిపారు. నిన్నటి నుంచే వాతావరణంలో కొంత మార్పు కనిపించింది. రాత్రి వేళ చల్లని గాలులు పలుకరించాయి. ఉష్ణోగ్రతలు కూడా తగ్గాయి. గాలిలో తేమ యాభై శాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు. రేపటి వరకూ వాతావరణం ఇలానే ఉండదనుందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News