అర్థరాత్రి భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదు

మంగళవారం అర్థరాత్రి అక్కడ భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైనట్లు

Update: 2022-02-02 09:15 GMT

ఇండోనేషియాను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా మంగళవారం అర్థరాత్రి అక్కడ భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైనట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలజీ సెంటర్ వెల్లడించింది. అక్కడి అధికారులు వెల్లడించిన వివరాల మేరకు.. భూకంపం వచ్చిన కేంద్రాన్ని 127 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. భూ ప్రకంపనల ధాటికి ఆ ప్రాంతంలో భయాందోళనలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు.

మంగళవారం అర్థరాత్రి 12.55 గంటలకు ఇండోనేషియాలోని కెపులావన్ బరాత్ దయా వద్ద భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల సునామీ వస్తుందన్న హెచ్చరికలేవీ జారీ అవ్వలేదు. అలాగే ఎంత మేర ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందన్న వివరాలేవీ తెలియరాలేదు. ఇదిలా ఉండగా జనవరి 19వ తేదీన 5.5 తీవ్రతతో ఇండోనేషియాలోని అమాహైకి తూర్పున 219 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చింది. ఆ తర్వాత జావా ప్రధాన ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి రాజధాని జకార్తాలోని భవనాలు ఒక్కసారిగా కుప్పకూలాయి.




Tags:    

Similar News