కైలాస్ మానసరోవర్ యాత్రకు ఓకే
కైలాస మానస సరోవర్ యాత్రకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
కైలాస మానస సరోవర్ యాత్రకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ తో పాటు చైనా కూడా యాత్రకు అంగీకరించడంతో ఈ యాత్ర ప్రారంభానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయినట్లే. భారత్ - చైనా సరిహద్దుల్లో ఉన్న కైలాస్ మానస సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించేందుకు రెండు దేశాలు అంగీకారానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
రెండు దేశాల అంగీకారంతో...
యాత్రకు ఇరు దేశాలు అంగీకరించాయి. అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మధ్య ఐదేళ్ల తరువాత జరిగిన చర్చల్లో ఆరు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. శాంతి స్థాపన, నదీ జలాలు, సిక్కిం-టిబెట్ మధ్య ఉండే నాథులా వాణిజ్య సరిహద్దు అంశాలపై ఇరు దేశాలు పురోగతి సాధించాయి. దీంతో పాటు కైలాస్ మానస సరోవర్ యాత్రకు కూడా అంగీకారం తెలిపాయి.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now