అమెరికాలో కాల్పుల కలకలం.. 20 మందిని రక్షించిన తెలుగు యువకుడు

అమెరికాలోని ఒక పాఠశాలలో కాల్పుల కలకలం రేపింది. ఏపీకి చెందిన యువకుడు ఈ కాల్పుల నుంచి 20 మంది విద్యార్తులను రక్షించాడు

Update: 2022-04-01 04:08 GMT

అమెరికాలోని ఒక పాఠశాలలో కాల్పుల కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకుడు ఈ కాల్పుల నుంచి 20 మంది విద్యార్తులను రక్షించాడు. అమెరికాలోని సౌత్ కారోలీనా టాంగిల్ వుడ్ స్కూల్ లో ఈ కాల్పుల ఘటన జరిగింది. కాల్పులు జరిపింది అదే స్కూలులో చదువుతున్న ఏడో తరగతి విద్యార్థిగా గుర్తించాడు. కాల్పులు జరిపిన విద్యార్థిని గ్రీన్ విల్లే కౌంటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తలుపులు మూసేసి.....
టాంగిల్ వుడ్ స్కూల్ లో విజయవాడ ప్రసాదంపాడుకు చెందిన కోనేరు శ్రీధర్ మ్యాథ్స్ టీచర్ గా పనిచేస్తున్నారు. కాల్పుల శబ్దం విన్న వెంటనే కోనేరు శ్రీధర్ తన క్లాసులో ఉన్న 20 మంది విద్యార్థులను బెంచిల కింద కూర్చోబెట్టి తలుపులు మూసివేశాడు. పోలీసులు ఘటన స్థలికి చేరుకునే వరకూ కోనేరు శ్రీధర్ విద్యార్థుల ప్రాణాలను కాపాడారు. కోనేరు శ్రీధర్ ను విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసించారు.


Tags:    

Similar News