Brazil : బ్రెజిల్ వర్ష బీభత్సం.. 37 మంది బలి.. 70 మందికి పైగా గల్లంతు
భారీ వర్షాల కారణంగా దాదాపు 37 మంది మరణించిన ఘటన బ్రెజిల్ లో జరిగింది
భారీ వర్షాల కారణంగా దాదాపు 37 మంది మరణించిన ఘటన బ్రెజిల్ లో జరిగింది. బ్రెజిల్ లోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండ్ దో సుల్ లో భారీ వర్షాలకు మరణించిన వారి సంఖ్య 37కు చేరుకుందని అధికారులు తెలిపారు. మరికొంత మంది ఆచూకీ తెలియడం లేదు. దాదాపు 70 మందికి పైగా గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. ఇంతటి విపత్తును గతంలో ఎన్నడూ చూడలేదని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని చెబుతున్నారు.
మృతుల సంఖ్య...
అనేక వంతెనలు, ఇళ్లు కూలిపోయాయి. శిధిలాల కింద అనేక మంది చిక్కుకున్నారని అనుమానంతో సహాయక చర్యలను ప్రారంభించారు. దీంతో ఈ ప్రాంతంలో ప్రభుత్వం ఎమెర్జెన్సీని ప్రకటించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. నిరాశ్రయులైన వారిని పునరావాస కేంద్రాలకు తరలించే పనిలో సహాయక సిబ్బంది ఉన్నారు. సర్వస్వం కోల్పోయిన వారికి ప్రభుత్వం నిత్యావసరాలను కూడా పంపిణీ చేస్తుందని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.