Aditya-L1: తుదికక్ష్యలోకి ప్రవేశించిన ఆదిత్య ఎల్ -1

ఆదిత్య ఎల్ 1 వ్యోమ నౌక తుది కక్ష్యలోకి ప్రవేశించింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో

Update: 2024-01-06 11:42 GMT

Aditya-L1: ఆదిత్య ఎల్ 1 వ్యోమ నౌక తుది కక్ష్యలోకి ప్రవేశించింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో శ్రీహరికోట నుండి శాస్త్రవేత్తలు వ్యోమనౌకను తుది కక్ష్యలోకి ప్రవేశ పెట్టారు. 2023 సెప్టెంబర్ 2 వ తేదీన ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 నేడు సూర్యుడికి సమీపంలోని లాగ్రాంజ్ పాయింట్ 1 వద్దకు చేరుకుంది. 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన ఆదిత్య ఎల్ 1 ను ఇస్రో శాస్త్రవేత్తలు నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 2023 సెప్టెంబర్ 2 వ తేదీన ఆదిత్య ఎల్ -1 ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించారు. 127 రోజుల పాటు ప్రయాణించిన ఆదిత్య ఎల్-1 సాయంత్రం నాలుగు గంటలకు తుది కక్ష్యలోకి చేరింది. ఐదేళ్ల పాటు ఆదిత్య ఎల్ -1 సేవలను అందించనుంది. సూర్యుడికి సమీపంలోని లాంగ్రాజ్ పాయింట్ హాలో కక్ష్యలోకి ఆదిత్య ఎల్ -1 శాటిలైట్ ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు.

ఆదిత్య ఎల్-1 తుది కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలను అభినందించారు. ఆదిత్య ఎల్ -1 విజయవంతంగా తుది కక్ష్యలోకి ప్రవేశించి మరో మైలు రాయిని అందుకుందన్నారు. అత్యంత క్లిష్టమైన అంతరిక్ష యాత్రను సాధించడంలో భారత శాస్త్రవేత్తుల అచంచలమైన అకింతభావాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. కొత్త శాస్త్రీయ పరిధులను అన్వేషించడానికి భారతదేశ నిబద్దతను ఈ ప్రయోగాలు రుజువు చేస్తున్నాయని ప్రధాని తెలిపారు.


Tags:    

Similar News