మరోసారి ఆప్ఘనిస్తాన్‌లో భూకంపం
ఆప్ఘనిస్థాన్ మరోసారి భూకంపంతో వణికిపోయింది. సహాయక చర్యలు జరుగుతుండగానే మరోసారి భూకంపం సంభవించింది
ఆప్ఘనిస్థాన్ మరోసారి భూకంపంతో వణికిపోయింది. సహాయక చర్యలు జరుగుతుండగానే మరోసారి భూకంపం సంభవించడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. బుధవారం తెల్లవారు జామున 6.11 గంటలకు భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతగా నమోదయిందని చెప్పారు.
6.1 తీవ్రతగా...
హెరాత్ నగరానికి 29 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదయినట్లు నేషనల్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. అయితే ప్రాణ, ఆస్తి నష్టం ఎంత అనేది ఇంకా తెలియరాలేదు. ఇటీవల ఆప్ఘనిస్థాన్ లో వరసగా జరిగిన భూకంపం వాల్ల నాలుగు వేల మంది వరకూ మరణించారు. మరోసారి భూకంపం రావడంతో ప్రజలు బెంబేలెత్తుతుతున్నారు.