బాబోయ్ వరదలు.. 109 మంది మృతి
ఆఫ్రికా దేశం రువాండాలో వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 109 మంది మరణించారు
ఆఫ్రికా దేశం రువాండాలో వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రువాండాలోని నదులు, వాగులు పొంగిపొరలుతున్నాయి. జనజీవనం స్థంభించి పోయింది. వ్యాపారాలు పూర్తిగా మూతపడ్డాయి. ఈ వరదల కారణంగా 109 మంది మరణించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఈ ఏడాది మొత్తం...
తెల్లవారుజామున వరదలు ముంచెత్తడంతో చాలామంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం తెలిపింది. వరదల కారణంగా వందలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయని తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా పేర్కొంది. ఈ ఏడాది మొత్తం రువాండాలో భారీ వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.