నేడు పట్టాభిషేకం

ఏడు దశాబ్దాల తర్వాత బ్రిటన్‌లో కింగ్ ఛార్లెస్ పట్టాభిషేకం జరగనుంది.

Update: 2023-05-06 03:39 GMT

ఏడు దశాబ్దాల తర్వాత బ్రిటన్‌లో కింగ్ ఛార్లెస్ పట్టాభిషేకం జరగనుంది. ఇప్పటికే బ్రిటన్ రాజుగా నియమితులైన ప్రిన్స్ ఛార్లెస్‌కు కిరీటం పెట్టనున్నారు. మూడో ఛార్లెస్‌కు ఈరోజు పట్టాభిషేకం జరగనుండటంతో ప్రజలు పండగలా చేసుకుంటారు. బ్రిటన్‌లోని కాంటెర్‌బరీ ఆర్చ్‌బిషప్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తొలుత కింగ్ ఛార్లెస్ ను అతిధులకు పరిచయం చేస్తారు. అనంతరం ప్రమాణం చేయించనున్నారు.

ఏడు దశాబ్దాల తర్వాత...
క్వీన్ ఎలిజబెత్ మరణం తర్వాత ఆమె కుమారుడు డెబ్భయి ఏళ్ల తర్వాత బ్రిటన్ రాజుగా పట్టాభిషేకాన్ని చేసుకోబోతున్నారు. ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు ఈ కార్యక్రమం జరగుతుంది. చివరి సారిగా 1953లో ఎలిజబెత్ రాణికి ఈ పట్టాభిషేకం జరిగింది. ఆమె మరణించిన తర్వాత ఆమె కుమారుడు ఛార్లెస్ నియమితులయ్యారు. ఈ కార్యక్రమం బ్రిటన్‌లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రభుత్వం పెద్దయెత్తున ఏర్పాట్లు చేసింది.


Tags:    

Similar News