ఏలియన్లు వచ్చారంటున్న సౌతాఫ్రికన్లు
డర్బన్, జోహన్నెస్‌బర్గ్‌లోని ప్రజలు కూడా దీని గురించి చెప్పుకొచ్చారు.
దక్షిణాఫ్రికాలోని పీటర్‌మారిట్జ్‌బర్గ్‌లో చాలా మంది వ్యక్తులు ఆకాశంలో ఆకుపచ్చని కాంతిని చూశామని చెబుతూ ఉన్నారు. అందుకు సంబంధించి పలువురు పోస్టులు పెట్టారు. పొడవాటి నీలి రంగు కాంతిని మేము చూశామంటే.. మేము చూశామని పీటర్‌మారిట్జ్‌బర్గ్ ప్రజలు చెప్పుకొచ్చారు. తమకెంతో ఆశ్చర్యానికి గురిచేసిందని వారు వెల్లడించారు. ఆకుపచ్చ రంగులో గ్రహశకలం లాంటి వస్తువు ఆకాశంలో కనిపించినట్లు వార్తలు వచ్చాయి. కొన్ని గంటల్లో సోషల్ మీడియా వినియోగదారులు దీని గురించి నివేదించారు. చాలా మంది గ్రహాంతర వాసులు వచ్చారని చెప్పుకొచ్చారు. డర్బన్, జోహన్నెస్‌బర్గ్‌లోని ప్రజలు కూడా దీని గురించి చెప్పుకొచ్చారు. మెరీనా బైస్ తన ఫేస్‌బుక్ పేజీలో "ఇది నిజంగా విచిత్రమైన దృశ్యం. మెరుస్తున్న లైట్లతో నేను ఓ వస్తువును చూశాను. నేను దాని గురించి మా సోదరికి చెప్పాను. నేను గ్రహాంతరవాసులు లేదా UFOలను నిజంగా నమ్మను, కానీ అది నిజమో కాదో ఎవరికి తెలుసు." అని చెప్పుకొచ్చింది. దక్షిణాఫ్రికాలోని పలు ప్రాంతాల్లో ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆకాశంలో ఆకుపచ్చ రంగులో కాంతి కనిపించింది. గ్రీన్ రంగులోని గ్రహశకలం మాదిరిగా ఇది ఉన్నట్లు దీనిని చూసిన కొందరు తెలిపారు. స్కాట్స్‌విల్లే, డర్బన్, జోహన్నెస్‌బర్గ్ ప్రాంతాల్లో ఈ వింత కాంతిని చూసినట్లు చాలా మంది ఫేస్‌బుక్‌లో వెల్లడించారు.