రష్యా పై అమెరికా సైబర్ అటాక్.. డిఫెన్స్ సైట్ డౌన్
ఉక్రెయిన్ పై యుద్ధం తగదని మొదట్నుంచి రష్యాను వారిస్తూ వస్తోంది అమెరికా. అయినా అమెరికా మాటను పెడచెవిన పెట్టి..
అమెరికా : ఉక్రెయిన్ పై యుద్ధం తగదని మొదట్నుంచి రష్యాను వారిస్తూ వస్తోంది అమెరికా. అయినా అమెరికా మాటను పెడచెవిన పెట్టి.. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగింది. రెండ్రోజులుగా రష్యా - ఉక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. అమెరికా రష్యాను టెక్నికల్ గా దెబ్బకొట్టింది. శుక్రవారం రష్యాపై అమెరికా సైబర్ అటాక్ కు దిగింది. రష్యా డిఫెన్స్ సైట్ ను అమెరికా డౌన్ చేసేసింది. ఉక్రెయిన్ తో ఉన్న విభేదాల పరిష్కారానికి అంతర్జాతీయ సమాజం చేస్తున్న వినతులను పెడచెవిన పెడితే.. రష్యాపై సైబర్ దాడులు తప్పవని అమెరికా గతంలోనే తేల్చి చెప్పింది.
చెప్పినట్లుగానే.. రష్యాపై సైబర్ అటాక్ చేసి చూపించింది. సైబర్ అటాక్ తో మున్ముందు అమెరికా రష్యాపై ఇంకెలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందోనన్న చర్చ మొదలైంది. భారత్, అమెరికా సహా ప్రపంచ దేశాలు ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఎంత చెప్పినా లాభం లేకపోయింది. అమెరికా, నాటో సహా పలు ఇతర దేశాలు చేసిన వినతులను ఏమాత్రం లెక్కచేయని రష్యా.. ఉక్రెయిన్ పై భీకర దాడులు చేస్తూ.. అక్కడి ప్రజలను చిగురుటాకులా వణికిస్తోంది.