Russia : ముందే హెచ్చరించామన్న అమెరికా
రష్యాలో ఉగ్రాదాడి జరుగుతుందని తాము నెలరోజుల క్రితమే హెచ్చరించినట్లు అమెరికా తెలిపింది
రష్యాలో ఉగ్రాదాడి జరుగుతుందని తాము నెలరోజుల క్రితమే హెచ్చరించినట్లు అమెరికా తెలిపింది. రష్యాలోని కాన్సర్ట్ సెంటర్ లో ఉగ్రవాదులు దాడులు జరిపి అరవై మందిని పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ దాడిలో వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. దీనికి తామే బాధ్యులమని ఐసీస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్రవాదులు దాడికి పాల్పడే అవకాశముందని తాము నెల రోజుల క్రితమే హెచ్చరించినట్లు వైట్ హౌస్ జాతీయ భద్రత మండలి అధికార ప్రతినిధి అడ్రియెన్నీ వాట్సన్ తెలిపారు.
రష్యా అధికారుల...
తమకు నెల రోజుల క్రితమే నిఘా వర్గాల ద్వారా ఈ సమాచారం అందిందని, ఈ విషయాన్ని వెంటనే రష్యాకు తెలిపామని ఆయన పేర్కొన్నారు. తాము అలెర్ట్ చేసినప్పటికీ రష్యా పెద్దగా పట్టించుకోలేదని పరోక్షంగా ఆయన అనడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయింది. రష్యా అధికారుల నిర్లక్ష్యం ఫలితంగానే అరవై మంది మృత్యువాత పడ్డారని అమెరికా ప్రకటన చూసిన తర్వాత ఎవరికైనా అర్థమవుతుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని కూడా చెబుతున్నారు.