వైద్య చరిత్రలో అద్భుతం.. మనిషికి పంది గుండె !
జంతువు నుంచి మనిషికి అవయవమార్పిడి చేయడంపై ఎంతోకాలంగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు డాక్టర్లు. సాధారణంగా మనిషి నుంచి మనిషికి
వైద్య చరిత్రలోనే అద్భుతం సృష్టించారు అమెరికా వైద్యులు. పంది గుండెను.. మనిషికి అమర్చి విజయం సాధించారు. ఈ విజయంతో ఇక అవయవాల కొరత సమస్యకు ఈ విధానం పరిష్కారం చూపవచ్చని భావిస్తున్నారు. ఈ విషయాన్ని యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ స్కూల్ ఓ ప్రకటనలో తెలిపింది. మేరీ ల్యాండ్ లో ఉంటున్న 57 ఏళ్ల వ్యక్తికి జంతువు గుండెను అమర్చడం వైద్యచరిత్రలోనే కీలక మైలురాయిగా నిలిచింది.
జంతువు నుంచి మనిషికి అవయవమార్పిడి చేయడంపై ఎంతోకాలంగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు డాక్టర్లు. సాధారణంగా మనిషి నుంచి మనిషికి ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ చేయడం సహజమే అయినా.. అవయవాల కొరత, దీర్ఘకాలంగా సరిగ్గా పనిచేయకపోవడం వంటి సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఈ ఆపరేషన్ తో పరిష్కారం దొరికినట్లు అయింది. జన్యుపరంగా మార్పు చెందిన పంది నుంచి తీసిన గుండెను విజయవంతంగా ఆ వ్యక్తికి అమర్చారు. వైద్య చరిత్రలో ఇలా చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకుంటున్నాడని, కొత్త అవయవం ఎలా పనిచేస్తుందన్న దానిపై అధ్యయనం చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు.