కరోనాతో వణుకుతున్న అమెరికా

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కరోనాతో వణుకుతుంది. కేసుల సంఖ్య రోజురోరోజుకూ పెరుగుతుంది

Update: 2021-12-31 03:22 GMT

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కరోనాతో వణుకుతుంది. కేసుల సంఖ్య రోజురోరోజుకూ పెరుగుతుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసినా మరోసారి కరోనా విజృంభించడం ఆందోళన కల్గిస్తుంది. తాజాగా అమెరికాలో 5.37 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తమయింది. ఆంక్షలు విధించకపోయినా ప్రజలు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాలని పేర్కొంది.

మిగిలిన దేశాల్లోనూ....
అమెరికాతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ కరోనా కేసులు ఎక్కువయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఒక్కరోజులోనే 18.16 లక్షల కేసులు నమోదయ్యాయి. ఫ్రాన్స్ లో అత్యధికంగా 2.06 లక్షలు, బ్రిటన్ 1.90 లక్షల కేసులు బయటపడ్డాయి. వీటికి తోడు ఒమిక్రాన్ కేసులు కూడా అత్యధికంగా నమోదవుతున్నాయి.


Tags:    

Similar News