ఇండోనేసియాలో భూకంపం
ఇండోనేసియాలో భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
ఇండోనేసియాలో భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రిక్టర్ స్కేల్ పై ఆరు గా నమోదు అయింది. ఈ మేరకు సుమత్రా ద్వీపం తీరంలోని భూకంప కేంద్రం అచే ప్రావిన్స్ లోని సింగ్ కిల్ నగరానికి దక్షిణాగ్నేయంగా 48 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు వెల్లడించారు.
భూకంపం కారణంగా...
అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అలాగే ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు కూడా లేదని అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భయపడాల్సిన పనిలేదని అధికారులు చెబుతున్నారు.