తజికిస్తాన్ లో భూకంపం
తజికిస్తాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.8 తీవ్రతగా నమోదయింది
ప్రపంచ దేశాలను వరసగా భూకంపాలు వణికిస్తున్నాయి. టర్కీలో సంభవించిన భూకంపం కారణంగా ప్రజలు భూ ప్రకంపనలకు వణికిపోతున్నారు. తాజాగా తజికిస్తాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.8 తీవ్రతగా నమోదయింది. తూర్పు తజకిస్థాన్ లో ఈ భూకంపం సంభవించింది.
వణికిపోయిన ప్రజలు...
భారత కాలమాన ప్రకారం ఈరోజు ఉదయం 5.37 గంటలకు భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. భూ ఉపరితలం నుంచి 20.5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించరు. భూకంపం ధాటికి ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.