ఫిలిప్పీన్స్‌లో భూకంపం
ఫిలిప్పీన్స్ లో భూకంపం సంభవించింది. గురువారం రాత్రి రెండు గంటలకు భూప్రకంపనలు కన్పించాయి
ఫిలిప్పీన్స్ లో భూకంపం సంభవించింది. గురువారం రాత్రి రెండు గంటలకు భూప్రకంపనలు కన్పించాయి. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతగా నమోదయినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు.
ప్రజల్లో వీధుల్లోకి...
భూప్రకంపనలను జరిగిన వెంటనే నిద్రలో ఉన్న ప్రజలు భయకంపితులై బయటకు పరుగులు తీశారు. టర్కీ, సిరియా భూకంపం గుర్తుకు వచ్చిన ప్రజలు భయాందోళనలతో వీధుల్లోకి వచ్చారు. ప్రజలను కాసేపు భూప్రకంపనలు వణికించాయి. మస్బేట్ ప్రావిన్స్ లోని మియాగా గ్రామానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు జియోలాజికల్ సర్వే వెల్లడించింది.