Srilanka : నేడు శ్రీలంక అధ్యక్షుడిగా అనుర కుమార దిస నాయకే ప్రమాణ స్వీకారం

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అనుర కుమార దిస నాయకే విజయం సాధించారు. ఈరోజు ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టనున్నారు;

Update: 2024-09-23 02:29 GMT
anura kumara disa nayake,  president, oath,  sri lanka, anura kumara disa nayake won sri lankas presidential election, anura kumara disa nayake  take oath as president today, sri lanka president 2024 anura kumara disa nayake

anura kumara disa nayake

  • whatsapp icon

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అనుర కుమార దిస నాయకే విజయం సాధించారు. ఈరోజు ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టనున్నారు. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా నేడు అనుర కుమార దిస నాయకే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన శ్రీలంకకు తొమ్మిదవ అధ్యక్షుడిగా ఉండనున్నారు. మార్కిస్ట్‌ పార్టీ నేతగా గెలిచిన అనుర కుమార దిస నాయకే తాను ఎన్నికల ప్రచారంలో శ్రీలంకలో సమూల మార్పులు చేస్తామని మాట ఇచ్చారు.

యాభై ఆరేళ్లకే...
యాభై ఆరేళ్లకే అనుర కుమార దిస నాయకే అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నారు. ప్రజలు ఆయనకు పట్టం కట్టడంతో నేటి నుంచి శ్రీలంకలో మార్కిస్ట్‌ల పాలన ప్రారంభం కానుంది. ఇటీవల శ్రీలంకలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం అనంతరం జరిగిన ఎన్నికల్లో అనుర కుమార దిస నాయకే ఘన విజయం సాధించారు. అయితే రెండో రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత మాత్రమే అనుర కుమార దిస నాయకేను అధికారికంగా ఎన్నికయినట్లు ప్రకటించారు.


Tags:    

Similar News