Covid 19 : అక్కడ మళ్లీ మాస్క్‌లను కంపల్సరీ చేశారుగా

సింగపూర్ లో కోవిడ్ కొత్త వేరియంట్ రావడం మళ్లీ ఆందోళనకు దారితీసింది

Update: 2024-05-19 03:07 GMT

సింగపూర్ లో కోవిడ్ కొత్త వేరియంట్ రావడం మళ్లీ ఆందోళనకు దారితీసింది. సింగపూర్ లో దాదాపు 26 వేల మంది ఈ వైరస్ బారిన పడినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 5వ తేదీ నుంచి పదకొండో తేదీ మధ్య కాలంలో 26 వేల మంది కొత్త వేవ్ తో అస్వస్థతకు గురయినట్లు చెప్పారు. సింగపూర్ లో మళ్లీ ప్రజలు మాస్క్ లు ధరించాలని ఆంక్షలు విధించారు.

జూన్ రెండో వారం వరకూ...
కేపీ 2 వేరియంట్ వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశ వైద్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంతే కాదు ఆసుపత్రుల్లో పడకల సామర్ధ్యాన్ని పెంచుకుంటే మంచిదని కూడా సూచించింది. రానున్న నెల రోజుల్లో కోవిడ్ కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని తెలిపింది. జూన్ నెల రెండో వారం వరకూ కేసుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలిపింది.


Tags:    

Similar News