బాగ్దాద్ లో కాల్పులు.. 20 మంది మృతి
ఇరాక్ రాజధాని బాగ్దాద్ అల్లర్లతో అట్టుడికిపోతుంది. భద్రతసిబ్బంది జరిపిన కాల్పుల్లో ఇరవై మంది మరణించారు
ఇరాక్ రాజధాని బాగ్దాద్ అల్లర్లతో అట్టుడికిపోతుంది. భద్రతసిబ్బంది జరిపిన కాల్పుల్లో ఇరవై మంది మరణించారు. రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు షీతె క్లెరిక్ మొఖ్తదా సదర్ ప్రకటించారు. ఆయన ప్రకటనను జీర్ణించుకోలేని సదర్ అభిమానులు పార్లమెంటు భవనాన్ని ముట్టడించారు. బాంబులతో పార్లమెంటు భవనంపై వారు దాడి చేయడంతో భద్రతా దళాలు వారిని చెదరకొట్టేందుకు ప్రయత్నించాయి.
ఈ రెండు వర్గాల మధ్యే...
అయినా సాధ్యం కాకపోవడంతో కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో సదర్ అభిమానులు పదిహేను మంది మృతి చెందారు. ఈ దాడుల్లో దాదాపు రెండు వందలకు మందికి పైగా గాయపడ్డారని తెలిసింది. ప్రొ ఇరాక్ కో ఆర్డినేషన్ ఫ్రేమ్ వర్క అనుకూల వ్యక్తులకు, సదర్ మద్దతు దారుల మధ్య ఘర్షణ జరిగిందని, భద్రతాదళాలు కాల్పులు జరపలేదని మరో వార్త ప్రచారంలో ఉంది దీంతో బాగ్దాద్ రణరంగంగా మారింది. తమతో చర్చలకు రావాలని కో ఆర్డినేషన్ ఫ్రేమ్ వర్క్ సూచించింది. ప్రస్తుతం బాగ్దాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.