పాకిస్థాన్ లో భారీ పేలుడు.. 44 మంది మృతి

ఖార్‌లోని JUI-F కు చెందిన ప్రముఖ నాయకుడు మౌలానా జియావుల్లా జాన్ ఈ పేలుడులో

Update: 2023-07-31 02:28 GMT

పాకిస్థాన్ మరో సారి బాంబు పేలుడుతో అట్టుడికింది.​ ఓ రాజకీయ పార్టీ మీటింగ్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. బహిరంగ సభలో వేదికకు సమీపంలోనే ఓ సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చేసుకోవడంతో 44 మంది మృత్యువాతపడ్డారు. 200కుపైగా మంది గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం అఫ్గానిస్తాన్ సరిహద్దులోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ బజౌర్ జిల్లా ఖర్ పట్టణంలో జమైత్ ఉలేమా ఇ ఇస్లామ్–ఫజల్(జేయూఐ–-ఎఫ్) పార్టీ మీటింగ్​లో ఈ బాంబు దాడి జరిగింది. క్షతగాత్రుల్లో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరగొచ్చని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. పార్టీ నాయకుల రాక కోసం ఎదురు చూస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని ఈ సభకు హాజరైన వ్యక్తులు చెప్పారు. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనని ఇంతవరకు ఏ టెర్రరిస్ట్ సంస్థా ప్రకటించుకోలేదు.

ఖార్‌లోని JUI-F కు చెందిన ప్రముఖ నాయకుడు మౌలానా జియావుల్లా జాన్ ఈ పేలుడులో మరణించినట్లు బజౌర్ జిల్లా అధికారులు చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని పెషావర్‌, టైమర్‌గెరా ఆసుపత్రులకు తరలించారు. "పాకిస్తాన్‌లోని బజౌర్‌లో JUI-F కార్మికుల సమావేశాన్ని లక్ష్యంగా చేసుకున్న పేలుడు జరిగిందని.. మరణించిన వారి సంఖ్య 10కి పెరిగింది, అయితే 30 మందికి పైగా గాయపడినట్లు నివేదించబడింది" అని పాకిస్తాన్ జియో న్యూస్ నివేదించింది. ముఖ్యమంత్రి ఆజం ఖాన్ ఈ దాడిని ఖండించారు. జిల్లా యంత్రాంగం నుండి నివేదిక కోరారు. JUI-F కేంద్ర సభ్యుడు అయిన ఖైబర్ పఖ్తుంఖ్వా గవర్నర్ హాజీ గులాం అలీ ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.


Tags:    

Similar News