బాంబ్ బ్లాస్ట్ : పరుగులు తీసిన ప్రధాని

జపాన్‌లో పేలుడు జరిగింది. ప్రధాని సభలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో జపాన్ ప్రధాని పుమియో కిషిడా పరుగులు తీశారు

Update: 2023-04-15 04:56 GMT

జపాన్‌లో పేలుడు జరిగింది. అదీ ప్రధాని ప్రసంగిస్తున్న సభలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో జపాన్ ప్రధాని పుమియో కిషిడా పరుగులు తీశారు. శనివారం ఈ ఘటన జరిగింది. వాకయామా నగరంలో జపాన్ ప్రధాని పుమియో కిషిడా ఒక సభలో ప్రసంగిస్తుండగా ఒక్కసారి పేలుడు జరిగింది. దీంతో స్పృహతప్పి పడిపోయిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రధాని ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి పరుగులు తీశారు.

ప్రసంగిస్తుండగా...
జపాన్ ప్రధాని పుమియో కిషిడాను భద్రతా సిబ్బంది సురక్షితంగా సభా వేదిక నుంచి బయటకు తీసుకెళ్లారు. వాకయాలో ఫిషింగ్ హార్బర్‌ను పరిశీలించిన అనంతరం పుమియో కిషిడా అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా పొగబాంబు గుర్తుతెలియని దుండగులు వేశారు. అయితే ఈ బాంబును వేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతను ఎవరు? కారణాలు ఏంటి? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటన నుంచి ప్రధాని సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.


Tags:    

Similar News