Liz truss : యూకే ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేశారు. 45 రోజుల్లోనే ఆమె తన పదవికి రాజీనామా చేశారు
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేశారు. 45 రోజుల్లోనే ఆమె తన పదవికి రాజీనామా చేశారు. దీంతో బ్రిటన్ లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇటీవల ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ తో లిజ్ ట్రస్ విమర్శలు పాలయ్యారు. ఇటీవల బ్రిటన్ లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఆహార ధరలు కూడా పెరుగుతున్నాయి. చివరకు బ్రిటన్ లో భోజన ఖర్చులను కూడా ప్రజలు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత సెప్టంబరు నెలలో యూకేలో ద్రవ్యోల్బణం పది శాతం కన్నా ఎక్కువగా నమోదయింది. విద్యుత్తు ఛార్జీలను కూడా ప్రభుత్వం ఫ్రీజ్ చేసింది.
ఆర్థికంగా సంక్షోభం....
80 శాతం మంది ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఇటీవల సర్వేలో కూడా వెల్లడయింది. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా వివాదానికి కారణమయింది. పన్నుల కోతపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోయిన లిజ్ ట్రస్ చివరకు రాజీనామాచ ేశారు. బ్రిటన్ చరిత్రలో అతి తక్కువ కాలం ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తిగా లిజ్ ట్రస్ నిలిచారని చెప్పుకోవచ్చు. మంత్రులు కూడా రాజీనామా చేయడంతో ప్రధాని పదవి నుంచి తాను కూడా తప్పుకున్నారు.