Candida Auris : కలవరం రేపుతున్న క్యాండిడా ఆరిస్ .. అమెరికాతో పాటు నలభై దేశాల్లో
క్యాండిడా ఆరిస్ వేగంగా విస్తరిస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనదని వైద్యులు చెబుతున్నారు. అమెరికాలో క్యాండిడ్ ఆరిస్ తో చాలా మంది బాధపడుతున్నారని చెబుతున్నారు.
Candida Auris :క్యాండిడా ఆరిస్ వేగంగా విస్తరిస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనదని వైద్యులు చెబుతున్నారు. అమెరికాలో క్యాండిడ్ ఆరిస్ తో చాలా మంది బాధపడుతున్నారని చెబుతున్నారు. వాషింగ్టన్ లోనే ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందినట్లు వైద్యులు తెలిపారు. అత్యంత వేగంగా విస్తరించే ప్రమాదకరమైన ఈ వైరస్ వ్యాధిని నియంత్రించేందుక అమెరిక ప్రభుత్వం సమాయత్తమయింది.
పదిహేనేళ్ల క్రితం....
ఈ వైరస్ కోసం వినియోగిస్తున్న మందులు కూడా పనిచేయడం లేదని వైద్యులు తెలిపారు. వాటిని తట్టుకుని మరీ వైరస్ వ్యాప్తి చెందుతుందని వైద్యులు అభిప్రాయం తెలియజేయడంతో మరింత ఆందోళన వ్యక్తమవుతుంది. సెంటర్ ఫర్ డిసీజ్్ కంట్రోల్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది తొలి కేసు జనవరి 10న నమోదయిందని తెలిపారు. అమెరికాతో పాటు నలభై దేశాల్లో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పింది. తొలిసారి క్యాండిడా ఆరిస్ ను జపాన్ లో పదిహేనేళ్ల క్రితం గుర్తించారు.