చైనాలో మరోసారి లాక్‌డౌన్

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో చైనా అప్రమత్తమయింది. దీంతో ఆ దేశంలో మరో సారి లాక్‌డౌన్ విధించింది.

Update: 2022-09-06 04:03 GMT

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో చైనా అప్రమత్తమయింది. దీంతో ఆ దేశంలో మరో సారి లాక్‌డౌన్ విధించింది. చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. దేశ వ్యాప్తంగా 1,552 కేసులు నమోదయ్యాయి. అయితే తక్కువ కేసులయినప్పటికీ జీరో కోవిడ్ విధానాన్ని అనుసరించాలని భావిస్తున్న చైనా లాక్ డౌన్ విధించింది. భూకంపం ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తుంది.

33 నగరాల్లో ఆంక్షలు....
పోర్టు టియాంజిన్ లో నిన్న 14 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ వ్యాప్తి జరగకుండా చైనాలో మొత్తం 33 నగరాల్లో లాక్ డౌన్ ఆంక్షలను విదించింది. విద్యాసంస్థలు పూర్తిగా మూసివేయాలని ఆదేశించింది. ఆంక్షలు విధించిన నేపథ్యంలో చైనాలోని అనేక నగరాల్లో పౌరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చైనా తీసుకున్న నిర్ణయంతో మొత్తం ఆరు కోట్ల మందిపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. లాక్ డౌన్ ఎన్ని రోజులు ఉంటుందన్నది ప్రభుత్వం చెప్పలేదు. కేసులు జీరో స్థాయికి వచ్చిన తర్వాతనే లాక్‌డౌన్ ఎత్తివేసే అవకాశముందంటున్నారు.


Tags:    

Similar News