మరో 6 నెలలు కరోనాతో పోరాడక తప్పదు : అమెరికా వైద్యులు
కరోనా వైరస్ తో మరో ఆరునెలలపాటు పోరాడక తప్పదని ప్రముఖ భారతీయ అమెరికన్ వైద్య నిపుణుడు,
కరోనా వైరస్ తో మరో ఆరునెలలపాటు పోరాడక తప్పదని ప్రముఖ భారతీయ అమెరికన్ వైద్య నిపుణుడు, 'అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్' గ్లోబల్ మెడికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ అయిన ఈదర లోకేశ్వరరావు తెలిపారు. మరో ఆరు నెలలకు కోవిడ్ ఎండెమిక్ స్టేజ్ కు అంటే.. సాధారణంగా కనిపించే స్థానిక వ్యాధుల్లో ఒకటిగా వస్తుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రోజులు గడిచేకొద్దీ కరోనా.. సాధారణ జలుబు, జ్వరం, దగ్గు మాదిరిగా ఉంటుంది.. కానీ ప్రజలు మాత్రం మాస్క్ లు ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక ఒమిక్రాన్ గురించి ఆందోళన చెందవద్దని, అది ఊపిరితిత్తులకు చేరకముందే నిర్వీర్యం అవుతుందని తెలిపారు. సరిపడినంత నిద్ర పోవడం, వ్యాయం, ధ్యానం చేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని డాక్టర్ లోకేశ్వరరావు సూచించారు.