చైనాలో 9ం కోట్ల మందికి కరోనా

చైనాలో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తుంది. ఈ నెల 11వ తేదీ నాటికి 90 కోట్ల మంది కరోనా బారిన పడినట్లు ఒక అధ్యయనంలో వెల్లడయింది

Update: 2023-01-14 04:26 GMT

చైనాలో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తుంది. ఈ నెల 11వ తేదీ నాటికి 90 కోట్ల మంది కరోనా బారిన పడినట్లు ఒక అధ్యయనంలో వెల్లడయింది. పెకింగ్ యూనివర్సిటీ చేసిన సర్వేలో ఈ షాకింగ్ విషయం వెల్లడయినట్లు నివేదికలో పేర్కొన్నారు. దేశ జనాభాలో 64 శాతం మంది వైరస్ బారిన పడినట్లు సర్వేలో వేల్లడయినట్లు, తమ అధ్యయనంలో విస్తుబోయే నిజాలను కనుగొన్నట్లు యూనివర్సిటీ పేర్కొంది.

వచ్చే రెండు మూడు నెలల్లో...
గాన్సూ ప్రావిన్స్ లో అత్యధికంగా 91 శాతం మంది వైరస్ బారిన పడినట్లు తేలిందన్నారు. యునాన్ ప్రావిన్స్లో 84 శాతం, కింఘాయ్ ప్రావిన్స్ లో 80 శాతం మంది కరోనా వైరస్ బారిన పడినట్లు తేలిందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు సయితం ఈ వైరస్ విస్తరించే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మరో రెండు, మూడు నెలలు ఈ వైరస్ తప్పదని హెచ్చరించింది.


Tags:    

Similar News