తీరం దాటిన మోచా.. తీరంలో అల్లకల్లోలం.. సురక్షిత ప్రాంతాలకు 5 లక్షల మంది

భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. కాక్స్ బజార్(బంగ్లాదేశ్), క్యయుక్

Update: 2023-05-14 13:12 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా తుఫాను బంగ్లాదేశ్, మయన్మార్ లను చిగురుటాకులా వణికిస్తోంది. వారంరోజులుగా భారత వాతావరణ విభాగం హెచ్చరించినట్టుగానే తీరంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. గంటలకు గరిష్టంగా 180-190 నుంచి 210 కిలోమీటర్ల వేగంతో వీస్తోన్న ఈదురుగాలులతో తీరప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఈదురుగాలులు, వర్షాలకు వాహనాలు, వస్తువులు కొట్టుకుపోతున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా.. ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల నుంచి 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. కాక్స్ బజార్(బంగ్లాదేశ్), క్యయుక్ ప్యూ (మయన్మార్)ల మధ్య మోచా తుపాను తీరం దాటింది. పశ్చిమ బెంగాల్ లోనూ అధికారులు అప్రమత్తమయారు. పుర్బా మేదినీపూర్, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. ఐదో కేటగిరీ తుపానుగా మోచా రూపుదాల్చడంతో బంగ్లాదేశ్, మయన్మార్ లు అప్రమత్తమయ్యాయి. 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజల కోసం 1500 తాత్కాలిక ఆశ్రయాలను ఏర్పాటు చేశారు. కాగా.. రెండు దశాబ్దాల్లో బంగ్లాదేశ్ ఎదుర్కొంటున్న అతిపెద్ద శక్తివంతమైన తుపాను ఇదేనని అధికారులు హెచ్చరించారు.


Tags:    

Similar News