పాకిస్థాన్ లో హిందూ వైద్యుడి దారుణ హత్య
ఈ ఘటన మార్చి 7 మంగళవారం జరిగింది. మరుసటిరోజే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ ధరమ్ దేవ్ కు, డ్రైవర్ కు మధ్య
పాకిస్థాన్ లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్ హైదరాబాద్ (పాక్ లోని నగరం)కు చెందిన ప్రముఖ చర్మవ్యాధుల నిపుణుడు డా. ధరమ్‌దేవ్ రాఠీని ఆయన డ్రైవరే గొంతుకోసి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన మార్చి 7 మంగళవారం జరిగింది. మరుసటిరోజే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ ధరమ్ దేవ్ కు, డ్రైవర్ కు మధ్య గొడవ జరిగినట్టు ధరమ్ దేశ్ ఇంట్లో పనిచేసే వంటమనిషి పోలీసులకు తెలిపింది. ఆ తర్వాత ధరమ్ దేవ్ బయటకు వెళ్లగా.. ఆయన ఇంట్లోకి రాగానే డ్రైవర్ వంటగదిలో ఉన్న కత్తిని తీసుకుని గొంతుకోసి హతమార్చాడు. అనంతరం ధరమ్ కారులోనే డ్రైవర్ పరారయ్యాడు.
భారత్ కు శత్రుదేశంగా భావించే పాక్ లో ఇప్పటికే మైనారిటీలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ వైద్యుడి హత్య జరగడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనను రాజకీయ పార్టీలు ఖండించాయి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని పీపీపీ పార్టీ మహిళ శాఖ చీఫ్ హామీ ఇచ్చారు. అక్కడున్న హిందువులు హోలీ వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో హిందూ వైద్యుడి హత్య జరగడం విచారకరమన్నారు. హత్యకు గురైన ధరమ్ దేవ్ కు వైద్యుడిగా మంచి పేరు ఉందని అక్కడి మీడియా పేర్కొంది.