Drain Fly: మన ముందు ఉండే ఈగనే.. కంటి చూపు పోడానికి కారణమైంది
చైనాలో ఒక వ్యక్తి తన ముఖంపై వాలిన ఈగను చంపడం
చైనాలో ఒక వ్యక్తి తన ముఖంపై వాలిన ఈగను చంపడం వల్ల ఏకంగా కంటినే కోల్పోయాడు. అతడికి ఇన్ఫెక్షన్ సోకడంతో అతని ఎడమ కనుగుడ్డును తొలగించాల్సి వచ్చింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) ప్రకారం.. వు అనే వ్యక్తి తనను ఇబ్బంది పెడుతున్న ఈగ తన ముఖంపై వాలిన తర్వాత దానిని చంపాడు.
ఒక గంట తర్వాత, అతని ఎడమ కన్ను ఎర్రగా అనిపించింది. తీవ్రమైన నొప్పి కలగడంతో అతను వెంటనే వైద్యులను సంప్రదించాడు. ఆ తర్వాత మందులు తీసుకున్నాక.. అతని పరిస్థితి మరింత దిగజారింది. చివరికి అతడి ఎడమ కంటిని తీసివేయవలసి వచ్చింది. చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌లోని దక్షిణ ప్రావిన్స్‌లోని షెన్‌జెన్‌లో నివసిస్తున్న వ్యక్తికి సీజనల్ కండ్లకలక వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు అవుట్‌లెట్ నివేదించింది. అతని ఎడమ కంటిలో నొప్పి రావడం ప్రారంభించగా మందులు తీసుకున్నాడు. అయినా నొప్పి తగ్గకపోవడంతో చూపు సమస్య మొదలైంది. ఇన్ఫెక్షన్ కారణంగా అతనిలో ఇలాంటి లక్షణాలు కనిపించాయని వైద్యులు అతనికి చెప్పారు. ఇన్ఫెక్షన్ అతని మెదడుకు వ్యాపించే ప్రమాదం ఉందనే భయంతో అతని ఎడమ కంటిని మొత్తాన్ని తొలగించాల్సి వచ్చింది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. అతడి కంటి చూపు పోడానికి కారణం.. డ్రైన్ ఫ్లై అని తేలింది. దీని లార్వా నీటిలో నివసిస్తుందని తేలింది. ఈ కీటకాలు సాధారణంగా బాత్‌రూమ్‌లు, బాత్‌టబ్‌లు, సింక్‌లు, కిచెన్‌లు వంటి ఇళ్లలోని చీకటి, తడి ప్రదేశాలలో కనిపిస్తాయి. ఒక కీటకం మీ కళ్ల దగ్గరికి ఎగిరినప్పుడు ప్రశాంతంగా ఉండాలని.. దానిని చంపేయాలని అనుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. దానిని సున్నితంగా తొలగించి ఆపై తాకిన ప్రాంతాన్ని శుభ్రమైన నీరు లేదా సెలైన్ ద్రావణంతో కడగాలని వైద్యులు సూచించారు.