ఇండోనేషియోలో భూకంపం

ఇండోనేషియాలో భారీగా భూమి కంపించింది. ఇండోనేషియాలోని సుమత్ర ద్వీపంలో భూమి కపంపించింది

Update: 2022-02-25 05:24 GMT

Indonesia : ఇండోనేషియాలో భారీగా భూమి కంపించింది. ఇండోనేషియాలోని సుమత్ర ద్వీపంలో భూమి కపంపించింది. దీంతో ప్రజలు భయకంపితులై బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.2 గా నమోదయింది. బుక్కిటింగ్ ప్రాంతానికి 66 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాలజికల్ సర్వే తెలిపింది.

ప్రాణ, ఆస్తి నష్టం.....
అయితే ఈ భూకంపంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. సునామీ అవకాశం కూడా లేదని పేర్కొంది. ప్రాణ, ఆస్తినష్టం లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది జనవరిలో పశ్చిమ సులవేసి ప్రావిన్స్లో భూకంపం 6.2 తీవ్రతతో సంభవించి 105 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.


Tags:    

Similar News