జపాన్ లో భారీ భూకంపం.. సునామీ భయం
జపాన్ లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6గా నమోదైంది
జపాన్ లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6గా నమోదైంది. దాంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. పలుమార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇషికావా ప్రాంత తీరానికి సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. సునామీ వస్తే 5 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉందని జపాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ఎన్ హెచ్ కే టీవీ హెచ్చరించింది. సునామీ వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో, ఇషికావా ప్రాంతంలోని అణు విద్యుత్ కేంద్రాల పరిస్థితిపై ఆందోళన నెలకొంది. జపాన్ వాతావరణ సంస్థ (JMA) ప్రకారం, భూకంపం ఇషికావా సమీపంలోని ప్రిఫెక్చర్‌లను తాకింది. వాటిలో ఒకటి 7.6 ప్రాథమిక తీవ్రతను కలిగి ఉందని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. స్థానిక వాతావరణ సంస్థల ప్రకారం, భూకంపం తర్వాత ఇషిగావాలోని నోటోలో భూకంప కేంద్రం నుండి 300 కిలోమీటర్ల దూరంలో సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది ప్రభుత్వం.