Breaking : సిరియాలో మళ్లీ భూకంపం
సిరియాలో మళ్లీ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేల్ పై 5.4 తీవ్రతగా నమోదయింది
సిరియాలో మళ్లీ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పై 5.4 తీవ్రతగా నమోదయింది. సిరియా, టర్కీలలో ఇటీవల సంభవించిన భూకంపం నుంచి ఇంకా ప్రజలు కోలుకోలేదు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిధిలాల తొలగింపు ప్రక్రియ వేగంగా చేస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. కనిపించని తమ బంధువుల కోసం ఆశగా ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు.
వణికిపోతున్న....
ఇదే సమయంలో మరోసారి సిరియాలో భూకంపం సంభవించడంతో ప్రజలు వణికిపోయారు. ఇప్పటికే టర్కీ, సిరియాలలో దాదాపు ముప్ఫయివేల మంది మరణించారని అధికారికంగా ప్రభుత్వం ధృవీకరించింది. అనేక మంది ఆవాసాలు కోల్పోయి పునరావాస కేంద్రాల్లో గడుపుతున్నారు. అనేక దేశాలు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. వస్తువుల రూపంలో, సైన్యం రూపంలో సహాయాన్ని అందిస్తున్నాయి. అయితే తాజాగా సంభవించిన భూకంప తీవ్రత వల్ల పెద్దగా నష్టం జరగలేదని చెబుతున్నారు.