మొరాకోలో భారీ భూకంపం
మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11:11 నిమిషాలకు
మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11:11 నిమిషాలకు భూమి కంపించింది. రిక్టార్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 6.8గా నమోదైంది. ఈ ఘటనలో 296మంది మరణించారు. 150 మందికిపైగా ప్రజలు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భూకంపం ధాటికి భవనాలు కదిలిపోయాయి.. ప్రజలు భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
"నైరుతి మర్రాకేశ్ ప్రాంతంలో భూమికి 18.5కిమీల దిగువన.. శుక్రవారం రాత్రి 11:11 గంటలకు 6.8 తీవ్రతతో భూకంపం నమోదైంది. చాలా సెకన్ల పాటు భూమి కంపించింది," అని అమెరికా జియోలాజికల్ సర్వే ఓ ప్రకటన విడుదల చేసింది. మొరాకోకు చెందిన నేషనల్ సీస్మిక్ మానిటరింగ్ అండ్ అలర్ట్ నెట్వర్కం మాత్రం.. ఈ భూకంపం తీవ్రత 7గా ఉందని తెలిపింది. భూకంపం సంభవించిన ప్రాంతంలో జనాభా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడి భవనాలకు భూ ప్రకంపనలను తట్టుకునే సామర్థ్యం లేదని అధికారులు తెలిపారు. తాజా ప్రకృతి విపత్తుతో అనేక భవనాలు దెబ్బతిన్నాయి. 2004లో ఈశాన్య మొరాకోలోని హొసిమాలో సంభవించిన భూకంపం ధాటికి.. 628మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1000మంది గాయపడ్డారు.