మయన్మార్‌లో భూకంపం
మయన్మార్‌లో భూకంపం సంభవించింది. ఈ రోజు సంభవించిన భూకంప తీవ్రతకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
మయన్మార్‌లో భూకంపం సంభవించింది. ఈ రోజు సంభవించిన భూకంప తీవ్రతకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే రిక్టర్ స్కేల్‌పై 4.2 తీవ్రతగా నమోదయిందని నేషనల్ ఫర్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. గురువారం ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయని పేర్కొంది.
4.2 తీవ్రతతో....
పది కిలోమీటర్ల లోతులో అది సంభవించిందని తెలిపింది. అయితే ఈ భూకంప తీవ్రత వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రజలు మాత్రం మళ్లీ భూకంపం వస్తుందన్న ఆందోళనతో బితుబితుకుమంటూ గడుపుతున్నారు.