Philippines: ఫిలిప్పీన్స్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత ఎంతో తెలుసా?

ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయంతో వణికిపోయారు. రిక్టర్ స్కేల్ పై 7.2 తీవ్రతగా గా నమోదు అయింది

Update: 2023-11-17 12:31 GMT

ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయంతో వణికిపోయారు. రిక్టర్ స్కేల్ పై 7.2 తీవ్రతగా గా నమోదు అయింది. దక్షిణ ఫిలిప్పీన్స్ లో ఈ భూకంపం సంభవించినట్లు ఫిలిప్సీన్స్ ఇన్సిట్యూట్ ఆఫ్ వల్కనాలజీ అండ్ సిస్మోలజీ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. సముద్ర గర్భంలో పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించారు.

భవనాలు నేలమట్టం...
భూకంపం తీవ్రతతో ఫిలిప్సీన్స్ వణికిపోయింది. అనేక రోడ్లు దెబ్బతిన్నాయి. భవనాలు కుప్ప కూలిపోయాయి. అనేక భవనాలకు గోడలు బీటలు వారాయి. అయితే ప్రాణ నష్టం ఎంత అనేది ఇంత వరకూ తేల్చలేదు. ఆస్తినష్టం మాత్రం భారీగానే జరిగి ఉంటుందని ప్రాధమిక అంచనాలను బట్టి తెలుస్తోంది. తరచూ భూకంపాలు ఇక్కడ సంభవిస్తుండటం పరిపాటిగా మారింది. ఈసారి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆస్తినష్టం ఎక్కువ జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


Tags:    

Similar News