నేపాల్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు
నేపాల్‌లోని బగ్లుంగ్ జిల్లా పరిధిలో అధికారిచౌర్ చుట్టూ అర్థరాత్రి తరువాత 1.23 గంటలకు, తెల్లవారుజామున 3.28 గంటల సమయంలో
మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో (తెల్లవారితే బుధవారం) స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి. ఆ సమయంలో నిద్రలో ఉన్న ప్రజలు.. భూమి ఊగుతున్నట్టు అనిపించడంతో భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. నేపాల్ లో ప్రజలంతా గాఢనిద్రలో ఉండగా.. మూడుసార్లు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నేపాల్లోని బగ్లుంగ్ జిల్లాలో మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత రిక్టర్ స్కేల్ పై 4.7 ఒకసారి, 5.3 ఒకసారి, 4.0గా మరోసారి భూకంప తీవ్రత నమోదైంది. కాగా.. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
నేపాల్లోని బగ్లుంగ్ జిల్లా పరిధిలో అధికారిచౌర్ చుట్టూ అర్థరాత్రి తరువాత 1.23 గంటలకు, తెల్లవారుజామున 3.28 గంటల సమయంలో భూమి కంపించింది. అలాగే.. బగ్లుంగ్ జిల్లాలోని ఖుంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో రాత్రి 2.07గంటలకు భూమి కంపించింది. మూడు సార్లు ఒకే జిల్లాలో భూప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
అలాగే భారత్ లోనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనూ స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి. ఉత్తరకాశీలో అర్థరాత్రి దాటిన తరువాత 2.19గంటలకు భూమి కంపించగా.. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ భూ ప్రకంపనలతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.