ఉద్యోగం నుండి తీసేసినందుకు 344 కోట్ల రూపాయలు

Update: 2022-10-28 08:34 GMT

ఎలాన్ మస్క్ గురువారం ట్విట్టర్ యజమాని అయ్యారు. వచ్చీ రాగానే ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్‌లను తొలగించారు. ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీ శాన్‌ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయం నుండి వెళ్లిపోయారు.. వారు తిరిగి వచ్చే అవకాశం లేదని తెలిపారు. ట్విటర్‌లోని ఇండియన్‌ సీఈవో అగర్వాల్‌, సెగల్‌తో పాటు లీగల్‌ పాలసీ, ట్రస్ట్‌, సేఫ్టీ హెడ్‌ విజయ గద్దెలను కూడా తొలగించినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ పేర్కొంది.

ట్విట్టర్ సీఈవోగా కీలక బాధ్యతలు చేపట్టిన భారతీయుడు పరాగ్ అగర్వాల్ కు ఇప్పుడు పెద్ద మొత్తం పరిహారంగా ముట్టనుంది. 2021 నవంబర్ లో ట్విట్టర్ సీఈవోగా అగర్వాల్ నియమితులయ్యారు. అప్పటి వరకు ఈ బాధ్యతలు చూసిన జాక్ డోర్సే అగర్వాల్ ను తన వారసుడిగా ప్రమోట్ చేశారు. నియమితులైన 12 నెలల్లోపే తొలగిస్తే చట్ట ప్రకారం 42 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. మన కరెన్సీలో సుమారు రూ.344 కోట్లు. ఇక 2021కి పరాగ్ అగర్వాల్ అందుకున్న పారితోషికం 30.4 మిలియన్ డాలర్లు (రూ.250 కోట్లు). పరాగ్‌ వార్షిక బేసిక్‌ సాలరీ, ఈక్విటీ అవార్డు ప్రకారం ఇంత డబ్బు రావచ్చని కథనాలు వస్తున్నాయి. కంపెనీకి సంబంధించిన ప్రాక్సీ స్టేట్‌మెంట్‌ నిబంధనల మేరకు ఈ పరిహారం మొత్తం 42 మిలియన్ డాల్లరు ఉండవచ్చని రాయిటర్స్‌ అంచనా వేసింది. ఇన్‌సైడర్ ప్రకారం మాజీ సీఎఫ్‌వోకు 25.4 మిలియన్‌ డాలర్లు, చీఫ్ లీగల్ ఆఫీసర్ విజయ గద్దె 12.5 మిలియన్‌ డాలర్లు అందుకోనున్నారు. అలాగే చీఫ్ కస్టమర్ ఆఫీసర్ సారా పెర్సోనెట్ 11.2 మిలియన్ల డాలర్లు తీసుకోనున్నారు.


Tags:    

Similar News